భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి

by velandi.Saikiran |

వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ షాక్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ శాఖ

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి
X

దిశా ములుగు: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ షాక్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ శాఖ ములుగు డివిజనల్ ఇంజినీరింగ్ పి. నాగేశ్వర రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.తడి బట్టలు చేతులతో విద్యుత్‌ తీగలు, స్విచ్‌లను తాకవద్దని, ఇళ్లలో తడి నేలపై ఎలక్ట్రిక్‌ తీగలు, పరికరాలు పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగి నేలపై పడిన సందర్భంలో వెంటనే 1912 నంబర్‌కి సమాచారం అందించాలని కోరారు. వ్యవసాయ మోటార్లకు , గృహాలలో నాణ్యత గల సర్వీసు వైరును మాత్రమే ఉపయోగించాలని, సెల్ ఫోన్ ఛార్జింగ్ అవుతున్న సమయంలో తడి చేతులతో తాకి మాట్లాడం వలన అనేకమంది మృత్యువాత పడ్డారని వివరించారు. షాక్ కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని వస్తువులను వాడడమే సరియైన పరిష్కారమని ఆ ప్రకటనలో నాగేశ్వరరావు తెలిపారు.

Next Story