జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

by Ratna Kumari |

జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేప‌టికి వాయిదా ప‌డింది.

జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
X

దిశ, జనగామ : జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లు పొడియం ముందు కూర్చొని నిరసనకు దిగారు. వారితో పాటు సీపీఎం అభ్యర్థి బూడిద జ్యోతి, స్వతంత్ర అభ్యర్థులు కూడా సంఘీభావం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యం వహిస్తున్నట్టు సమాచారం. అలాగే స్వతంత్ర అభ్యర్థులు మారబోయిన పాండు, మిద్దెపాక భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ కౌన్సిలర్లు గట్టిగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో చైర్మ‌న్ ఎన్నిక‌ను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. భ‌ద్ర‌తా ప‌రిస్థితులు, రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు స‌మాచారం.

Next Story