పురుగుల మందు తాగి వృద్ధుడు మృతి..

by Bhanu |

అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి వృద్ధుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తొర్రూరు మండలంలోని కర్కాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

పురుగుల మందు తాగి వృద్ధుడు మృతి..
X

దిశ, పాలకుర్తి : అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి వృద్ధుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తొర్రూరు మండలంలోని కర్కాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న ఎర్ర సోమయ్య (77) గత రెండేళ్లుగా బీపీ, షుగర్, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వివిధ ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఎప్పటికీ ఉపశమనం లభించకపోవడంతో మానసికంగా కుంగిపోయిన సోమయ్య, సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు సేవించాడు.

వాంతులు చేస్తూ బాధపడుతున్న ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగానే మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆయన మృతి చెందారని ఎస్సై రాంజీ నాయక్ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఎర్ర వెంకట్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story