- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఉపాధి’ కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి..
ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసీ తప్పనిసరని అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

‘ఉపాధి’ కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి..
- అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కె.శ్రీనివాస్ రెడ్డి
దిశ, కమలాపూర్: ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసీ తప్పనిసరని అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులు, ప్లాంటేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధి హామీ కూలీలందరినీ తప్పనిసరిగా ఈ కేవైసీ ఈనెలాఖరులోగా చేయించాలని, ప్రతి గ్రామంలోని ప్లాంటేషన్స్ లో తప్పనిసరిగా నూటికి నూరు శాతం మొక్కలు బతికి ఉండే విధంగా చూసుకుని, ప్రతి ప్లాంటేషన్ కు వాచర్ ను నియమించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తప్పనిసరిగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు ఇప్పించాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం చేసి దాని ద్వారా రూ.6544 లబ్ధి పొందేటట్లు చూడాలని సూచించారు. ప్రతి ఇందిరమ్మ గృహ లబ్ధిదారునికి ఉపాధి హామీ పథకంలో 90 రోజులు హాజరు వేసి రూ.27,630 వచ్చే విధంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ సమావేశంలో ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, డీటీసీ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.






