మెడిక‌ల్ షాపుల్లో త‌నిఖీలు పెంచాం: హ‌న్మ‌కొండ జిల్లా డ్రంగ్ కంట్రోల్ అధికారి కిర‌ణ్‌

by Bhanu |

వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లోని ఫార్మ‌సీ కేంద్రాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు హ‌న్మ‌కొండ, వ‌రంగ‌ల్ జిల్లాలో డ్రంగ్ కంట్రోల్ అధికారి కిర‌ణ్ తెలిపారు.

మెడిక‌ల్ షాపుల్లో త‌నిఖీలు పెంచాం: హ‌న్మ‌కొండ జిల్లా డ్రంగ్ కంట్రోల్ అధికారి కిర‌ణ్‌
X

దిశ‌, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లోని ఫార్మ‌సీ కేంద్రాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు హ‌న్మ‌కొండ, వ‌రంగ‌ల్ జిల్లాలో డ్రంగ్ కంట్రోల్ అధికారి కిర‌ణ్ తెలిపారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మెడిక‌ల్ షాపుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. మెడిక‌ల్ షాపుల మాయ‌జాలం అనే శీర్షిక‌తో మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ దిశ టాబ్లాయిడ్‌లో క‌థ‌నం ప్ర‌చురిత‌మైన విష‌యం పాఠకుల‌కు విదిత‌మే. మెడిక‌ల్ షాపుల నిర్వాహాకుల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. క‌థ‌నంలో పేర్కొన్న అంశాల‌పై డీసీవో కిర‌ణ్ స్పందించారు.

త‌నిఖీలు జ‌ర‌గ‌డం లేదనడంలో వాస్త‌వం లేద‌ని అన్నారు. గ‌డిచిన సంవ‌త్స‌ర కాలంగా ఫార్మ‌సీ విక్ర‌య కేంద్రాల్లో ప్ర‌తీ నెలా హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లో 100కు పైగా కేంద్రాల‌ను డ్రంగ్ కంట్రోల‌ర్ అధికారులు,సిబ్బంది త‌నికీలు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన 16 మెడిక‌ల్ షాపుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో కొన్ని విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయ‌ని అన్నారు. కొన్నింటిని సీజ్ కూడా చేసిన‌ట్లు తెలిపారు.

విద్యార్హ‌త‌లు లేని వారిని మెడిక‌ల్ షాపుల్లో నియ‌మించుకుంటున్న‌ట్లుగా త‌మ దృష్టికి వ‌స్తున్న‌.. నిర్దిష్ట‌మైన ఆధారాలు ల‌భించ‌లేద‌ని అన్నారు. నిర్దిష్ట‌మైన ఆధారాలు ల‌భ్య‌మైతే.. మెడిక‌ల్ షాపుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. జిల్లా డ్రంగ్ కంట్రోల్ అధికారులు ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు.



Next Story