- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డోర్నకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం కంపు కంపు..!
నిత్యం కళకళలాడే కార్యాలయం దుర్గంధం వెదజల్లుతుంది. వివిధ పనులపై వచ్చే పౌరులు కంపు భరించలేక ముక్కులు మూసుకుంటున్నారు.

దిశ, డోర్నకల్ : నిత్యం కళకళలాడే కార్యాలయం దుర్గంధం వెదజల్లుతుంది. వివిధ పనులపై వచ్చే పౌరులు కంపు భరించలేక ముక్కులు మూసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మరుగుదొడ్లు దుర్గంధం వెదజల్లుతున్నాయి. తలుపులు ఊడి,వ్యర్ధపు పైపులు మూసుకుపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. పక్కనే ఉన్న సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు కంపును కవర్ చేయడానికి మరుగుదొడ్డి గోడలకు సువాసన వెదజల్లే ఆగరుబత్తీలు పెట్టిన సందర్భాలు ఉన్నట్లు పలువురు తెలిపారు.
ఏండ్ల తరబడి కంపును భరిస్తున్నట్లు సిబ్బంది, ప్రజలు వాపోతున్నారు. అధికారులు మారిన మరుగుదొడ్లు మరమ్మతులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎంపీడీవో శ్రీనివాస్ వివరణ కోరగా.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.






