- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంధువులు కాదు.. రాబందులు.. దాతలు చేసిన సహాయం దండుకున్న వైనం
అనారోగ్యంతో మంచాన పడిన తండ్రి చికిత్స కోసం దాతల సహాయానికి ఆశ్రయించి, అందిన నిధులు కూడా కుటుంబ సభ్యుల ద్వారానే దుర్వినియోగం కావడం ఒక పేద కుటుంబానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

దిశ, మంగపేట : అనారోగ్యంతో మంచాన పడిన తండ్రి చికిత్స కోసం దాతల సహాయానికి ఆశ్రయించి, అందిన నిధులు కూడా కుటుంబ సభ్యుల ద్వారానే దుర్వినియోగం కావడం ఒక పేద కుటుంబానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మంగపేట మండలం కమలాపురంకు చెందిన ఓ బాధిత కుటుంబం గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని ఆవేదన వ్యక్తం చేసింది.
వారి వేదన ఇలా ఉంది..
కమలాపురం కోరుకొప్పుల వీధికి చెందిన సత్యం అనే వ్యక్తి గ్రామంలో ఓ కేబుల్ ఆపరేటర్ వద్ద పని చేస్తూ, కొంతకాలం క్రితం పక్షవాతంతో మంచాన పడ్డాడు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఆయన భార్య కోరుకొప్పుల రాణి, కూతుళ్లు రేణు అక్షయ, రేణు అక్షితలు తమ వాట్సాప్ గ్రూపుల ద్వారా సాయం కోసం దాతలకు వేడుకున్నారు.
దాతలు హృదయపూర్వకంగా స్పందించి దాదాపు రూ.10 లక్షల వరకు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. అయితే అందిన మొత్తంలో రూ.4 లక్షల వరకు మాత్రమే వైద్యానికి ఖర్చయ్యిందని, మిగిలిన రూ.6 లక్షలు తమ బాబాయిలు రాజు, నరేష్ లు స్వధీనం చేసుకున్నారని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా, తమపై అధికారం చెలాయిస్తూ "ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి" అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.
అంతే కాకుండా, ఉమ్మడి ఆస్తిలో తమకు వచ్చే వాటాలను కూడా గ్రామానికి చెందిన బాలసాని వెంకటేశ్వర్లు, జయ, తెలగాని సంతోష్ లకు అమ్మేశారని ఆరోపించారు. తమ వద్ద బలవంతంగా సంతకాలు చేయించారని, ప్రాణాలకు ముప్పుగా మారుతున్న పరిస్థితుల్లో అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. ఈ అంశంపై తహసీల్దార్‌ను 'దిశ' వివరణ కోరగా.. ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు.






