మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రిలో వైద్యుల నిరసన.!

by Elthuri vijay kumar |

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస రావును దూషించి, దాడి చేయబోయిన వారిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ మంగళవారం ఆస్పత్రి డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు.

మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రిలో వైద్యుల నిరసన.!
X

మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రిలో వైద్యుల నిరసన.!

ఓపీ సేవలు బంద్.. రోగుల అవస్థలు.!

దిశ, మహబూబాబాద్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస రావును దూషించి, దాడి చేయబోయిన వారిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ మంగళవారం ఆస్పత్రి డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ సేవ్ డాక్టర్స్ సేవ్ లీవ్స్ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. కలెక్టర్, ఎస్పీ రావాలంటూ నినదించారు. నిరసన స్థలానికి చేరుకున్న అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, డీఎస్పీ తిరుపతిరావు బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ నచ్చజెప్పినప్పటికీ వారు వినకుండా సాయంత్రం వరకు నిరసన తెలిపారు. దీంతో ఓపీ సేవలు నిలిచిపోగా రోగులు అవస్థలు పడ్డారు. దీంతో చేసేదేమీ లేక కొంతమంది రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్ బాటపట్టారు.

Next Story