విద్యాసంస్థలకు వంద మీటర్ల లోపు గుట్కాలు సిగరెట్లు అమ్మవద్దు : ఎస్ఐ చంద్రశేఖర్

by Nallavelli.Anjaneyulu |

విద్యాసంస్థలకు వంద మీటర్ల లోపు గుట్కాలు, సిగరెట్లు అమ్మవద్దని ములుగు ఎస్సై చంద్రశేఖర్ అన్నారు.

విద్యాసంస్థలకు వంద మీటర్ల లోపు గుట్కాలు సిగరెట్లు అమ్మవద్దు : ఎస్ఐ చంద్రశేఖర్
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : విద్యాసంస్థలకు వంద మీటర్ల లోపు గుట్కాలు, సిగరెట్లు అమ్మవద్దని ములుగు ఎస్సై చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మండలంలోని అబ్బాపూర్, ములుగు, బండారుపల్లి గ్రామాల్లో నిధినార్కోటిక్స్ డాగ్ చే కిరాణా షాపులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నందున విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు గురికాకూడదనే ఉద్దేశంతో విద్యా సంస్థలకు దగ్గరగా ఉన్న షాపులన్నీ తనిఖీ చేయడం జరుగుతున్నదని, 100 మీటర్ల లోపల ఉన్న దుకాణాల యజమానులు ఎలాంటి నిషేధిత పదార్థాలు అమ్మ రాదని హెచ్చరించారు.


ట్రాక్టర్ కేజీ వీల్స్ తో రోడ్ల పై ప్రయాణిస్తే జరిమానాతో పాటు కేసు నమోదు ములుగు మల్లంపల్లి లోని రైతులు, ట్రాక్టర్ ఓనర్స్, డ్రైవర్లు ట్రాక్టర్ కేజీ వీల్స్ తో రోడ్ల పై ప్రయాణిస్తే జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని ఎస్సై చంద్రశేఖర్ హెచ్చరించారు. వర్షాకాలం పంటలు సాగు చేయడానికి ట్రాక్టర్ కేజీ వీల్స్ తో రోడ్డుపై వెళ్ల‌డం వల్ల‌ రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.

Next Story