పేదవాడి ఆకలి తీర్చేందుకే రేషన్ కార్డుల పంపిణీ : మంత్రి శ్రీధర్ బాబు

by Chintha Aamani |

పేదవాడి ఆకలి తీర్చి వారిని ఆదుకోవాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ, సన్నం బియ్యం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

పేదవాడి ఆకలి తీర్చేందుకే రేషన్ కార్డుల పంపిణీ :  మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ,భూపాలపల్లి : పేదవాడి ఆకలి తీర్చి వారిని ఆదుకోవాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ, సన్నం బియ్యం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం కాటారం మండల కేంద్రంలోని కాటారం డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రజలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశామని జిల్లాలో 278 రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 60438 మంది కుటుంబాలకు 362 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేసి పేద కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నామని జిల్లాలో 52000 కుటుంబాలకు 26 కోట్ల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, ఇందిరమ్మ పథకం ద్వారా 3500 మందికి ఇళ్ల మంజూరు చేశామని ఆయన తెలిపారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు విడుదల వారీగా ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్ల మంజూరులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని పారదర్శకంగా ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందిస్తామన్నారు. అనంతరం ఆయన పలువురికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో మునిగి చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. కాటారం సబ్ డివిజన్ లోని పలువురికి సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Next Story