దిశ వార్తకు స్పందన..వివాహితుడిపై ఫోక్సో కేసు నమోదు

by velandi.Saikiran |

నమ్మించి మోసం చేసిన వివాహితుడిపై ఫోక్సో కేసు నమోదు అయింది. ఈ సంఘ‌ట‌న బ‌య్యారంలో జ‌రిగింది.

disha news effect A POCSO case registered against a married man who cheated on a trust
X

disha news effect A POCSO case registered against a married man who cheated on a trust

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కొన్ని సంవత్సరాలుగా ఓ యువతిని శారీరకంగా, మానసికంగా లోబ‌ర్చుకొని ప్ర‌య‌త్నం చేశాడు ఓ దుర్మార్గుడు. అంతేకాదు ఆ మహిళ శీలానికి వెలకట్టే ప్రయత్నం చేయడంతో వివాహేతుడిపై శుక్రవారం ఫోక్సోకేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. జనవరి 7 నమ్మించి నట్టేట ముంచి...! అనే క‌థ‌నం దిశలో వ‌చ్చింది. ఇక ఈ కథనం వ‌చ్చిన త‌రుణంలోనే స్పందించారు పోలీసులు. నమ్మించి మోసం చేసిన వివాహితుడిపై ఫోక్సో కేసు చేశారు. భూక్య హుస్సేన్ పై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story