డిజిట‌ల్ మీడియాలో ''దిశ'' కొత్త చ‌రిత్ర లిఖిస్తోంది: MLA Aruri Ramesh

by Disha Web Desk 19 |
డిజిట‌ల్ మీడియాలో దిశ కొత్త చ‌రిత్ర లిఖిస్తోంది: MLA Aruri Ramesh
X

దిశ‌, వ‌రంగ‌ల్ క‌లెక్టరేట్: జ‌ర్నలిజంలో ''దిశ'' ఒక అద్భత‌మైన ప్రస్థానాన్ని ఆరంభించింద‌ని వ‌రంగ‌ల్‌ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ అన్నారు. డిజిట‌ల్ మీడియా య‌వ‌నిక‌పై కొత్త చ‌రిత్రను రాస్తోంద‌ని కొనియాడారు. ఎప్పటిక‌ప్పుడు తాజా వార్తల‌ను, చ‌దివింప‌ద‌గిన వార్తల‌ను పాఠ‌కుల‌కు అంద‌జేస్తోంద‌ని అన్నారు. దిశ వార్తల క్లిప్పింగ్స్ నిత్యం సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయ‌ని, అతి త‌క్కువ కాలంలోనే దిశ‌ కోట్లాది మంది పాఠ‌కులను ఆక‌ర్షించ‌గ‌ల‌గ‌డం నిజంగా ఎంతో గొప్ప విష‌య‌మ‌న్నారు.

ఆదివారం ఆయ‌న స్వగృహంలో దిశ నూత‌న సంవ‌త్సర క్యాలెండ‌ర్‌ను పార్టీ నాయ‌కులతో క‌లిసి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ప‌త్రిక యాజ‌మాన్యానికి, రిపోర్టర్లకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. దిశ ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా బ్యూరో చీఫ్ ఆరెల్లి కిర‌ణ్ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స‌మ‌గ్ర క‌థ‌నాలు రాస్తున్నారంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో దిశ రిపోర్టర్లు శ్రీహ‌రి రాజు, క్యాండిడ్ గౌత‌మ్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed