- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి.. హనుమండ్ల ఝాన్సీరెడ్డి
by Batti.Sumithra |
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు.

X
దిశ, పెద్దవంగర : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలిపారు. చేరిన వారిలో పాక చినరాములు, రమేష్, బిక్షపతి, మహేందర్, సోమయ్య, యాకయ్య, శివ, వెంకన్న, ఉప్పలయ్య, నారాయణ, కొమురయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.
Next Story






