బాస‌ర టూ భ‌ద్రాచ‌లం అభివృద్ధి : మంత్రి సీతక్క

by Ratna Kumari |

ఆదిలాబాల్ జిల్లా బాసర నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వరకు గోదావరి సర్క్యూట్ గా ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ( సీతక్క) అన్నారు.

బాస‌ర టూ భ‌ద్రాచ‌లం అభివృద్ధి : మంత్రి సీతక్క
X

దిశ, మంగపేట : ఆదిలాబాల్ జిల్లా బాసర నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వరకు గోదావరి సర్క్యూట్ గా ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని మల్లూరు, మంగపేట గ్రామాల్లో ప్రజాదర్బార్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అద్యక్షతన నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు లేని మంగపేట మండలాన్ని 6 జోన్లుగా విభజించి ప్రజాదర్బార్లు నిర్వహించి ఆయా పంచాయతీల్లో సమస్యలను పరిష్కరించనున్నట్లుు తెలిపారు. 20 సంవత్సరాలుగా మంగపేట మండలంలో ప్రజాప్రతినిధులు లేనందున స్వయంగా తానే సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని మంగపేట, మల్లూరు పంచాయతీల్లో వాటి అనుబందంగా ఉన్న కొన్ని పంచాయతీల్లోని సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాగమే గ్రామాల్లోకి వచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.


మంగపేట మండల కేంద్రంలో సంత కోసం ఫారెస్టు స్థలాన్ని కేటాయిస్తూ కలెక్టర్ ను ఆదేశించారు. నర్సాపురం బోరు నుంచి గోదావరి వరకు రైతుల కోసం రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంఖుస్థా+పన చేశారు. మండల కేంద్రంలోని బస్టాండ్ నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు. గోదావరి పుష్కరాలు ఉన్నందున ఏటూరునాగారం నుంచి భద్రాచలం వరకు పుష్కరఘాట్ల నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. మంగపేట డబుల్ లేన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలన్నారు. మంగపేట నుండి కాటాపూర్ వరకు రోడ్డు మల్లూరు హేమాచలం అభివృద్ధికి 70 కోట్లతో పర్మినెంట్ అభివృద్ధి పనులు చేసేందుకు గుర్తించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. వారం రోజుల్లో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను తాత్కాలిక పద్దతుల్లో నిర్వహించి బ్రహ్మోత్సవాల అనంతరం పర్మినెంట్ పనులు ప్రారంబించనున్నట్లు తెలిపారు. బాసర టూ భద్రాచలం సర్క్యూట్ లో బాగంగా గోదావరి పరివాహక ప్రాంతాల మండలాలైన గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి సీతక్క తెలిపారు. భద్రాచలంలో5 వందల కోట్లు, బాసరలో పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు మంజూరు, కాళేశ్వరం, మేడారం, హేమాచల లక్షమీనర్సింహాస్వామి ఆలయానికి నిధులు కేటాయించినట్టు తెలిపారు. ప్రజల సహాకారంతో ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్టు వెల్ల‌డించారు. నియోజకవర్గంలోని 10 మండలాల్లో ఇందిరమ్మ, మొదటి విడతలో 5 వేల ఇండ్లు ఇచ్చానని, రెండో విడతల్లో అర్హులైన అందరికీ ఇళ్లు, పింఛ‌న్లు, ఇవ్వడానికి కృషి చేయనున్నట్టు తెలిపారు.

Next Story