- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య..
తాడ్వాయి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మేడారం గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల భారం తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, ఏటూరునాగారం: తాడ్వాయి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మేడారం గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల భారం తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు, మృతుడు పిల్లి సత్యం (50) తన భార్య జ్యోతి (40)తో కలిసి పూసల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే వ్యాపారం నిరంతరంగా నష్టాల్లో నడవడంతో ఆయన గ్రామంలోని కొంత మంది వద్ద మొత్తం పది లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయిన సత్యం, అప్పులు ఎలా తీర్చాలో తెలియక తల్లడిల్లుతున్నాడని, ఇటీవల పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తూ భార్యతో తన పరిస్థితిని పంచుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సోమవారం ఉదయం, గ్రామంలోని తన షాప్ వెనుక ఉన్న షెడ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు శబ్దం విని అటుగా చేరుకుని తాడు విప్పి క్రిందికి దింపేలోపే అతను మృతిచెందినట్లు తెలిపారు. సత్యం భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది.






