బైనాన్స్ యాప్ తో సైబ‌ర్ మోసం.. యువ‌కుడు అరెస్ట్

by Ratna Kumari |

జనగామ పట్టణానికి చెందిన మహేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటూ మొబైల్‌లో బైనాన్స్ యాప్ ద్వారా నాలుగు మ్యూల్ అకౌంట్లు సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బైనాన్స్ యాప్ తో సైబ‌ర్ మోసం.. యువ‌కుడు అరెస్ట్
X

దిశ, జనగామ : జనగామ పట్టణానికి చెందిన మహేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటూ మొబైల్‌లో బైనాన్స్ యాప్ ద్వారా నాలుగు మ్యూల్ అకౌంట్లు సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇతరులతో చేతులు కలిపి ఆ అకౌంట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు మహేష్ పాత్ర స్పష్టంగా బయటపడినట్లు జనగాం టౌన్ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భరత్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అపరిచిత లింకులు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story