- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్సై రమేష్ బాబు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు దరఖాస్తు చేసినవారని చెప్పి వాట్సాప్ లో లింకులు పంపించే సైబర్ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిర్ర రమేష్ బాబు హెచ్చరించారు.

X
దిశ, నెల్లికుదురు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు దరఖాస్తు చేసినవారని చెప్పి వాట్సాప్ లో లింకులు పంపించే సైబర్ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిర్ర రమేష్ బాబు హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, పీఎం కిసాన్, ముద్రా లోన్ వంటి పథకాల పేరుతో నేరగాళ్లు లింకులు పంపి మోసానికి పాల్పడుతున్నారని చెప్పారు.
తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందని చెప్పి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి సందేశాలు వచ్చినపుడు వాటిని ఓపెన్ చేయకుండా నిర్లక్ష్యం చేయాలని సూచించారు. ఇలా మోసపూరితంగా వ్యవహరించే వ్యక్తులపై సైబర్ నేరాలపై కేసులు నమోదు చేస్తున్నామని, ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని జాగ్రత్తలు పాటించాలని ఎస్సై రమేష్ బాబు తెలిపారు.
Next Story






