రేణ్యా తండాలో కార్డెన్ సర్చ్:14 బైకులు సీజ్.. గుడుంబా, బెల్లం పానకం ధ్వంసం

by Disha Web Desk 11 |
రేణ్యా తండాలో కార్డెన్ సర్చ్:14 బైకులు సీజ్.. గుడుంబా, బెల్లం పానకం ధ్వంసం
X

దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు ఆదివారం కొత్తగూడ మండల పరిధి రేణ్యా తండాలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. తండాలో అక్రమంగా నిలువచేసిన 30 లీటర్ల గుడుంబా,100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ నగేష్ మాట్లాడుతూ.. ప్రజల్లో పోలీసులపై ఉన్న భయాన్ని తొలగించడంతో పాటు వారి మేలు కోసమే కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.

వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించడంతో పాటు ఆధార్‌కార్డులు, వారు చేసే పని, ఇంట్లో ఎంతమంది ఉంటారన్న వివరాలను సేకరించినట్లు తెలిపారు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దిలీప్, ఆర్ఎస్ఐ, సివిల్, స్పెషల్ పార్టీ, కేంద్రం బలగాలు, భారీ ఎత్తున పోలీసులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed