పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించండి : మెరుగు మల్లేశం

by Bhanu |

కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు గౌరవం లభించాల్సిందేనని తొర్రూరు కాంగ్రెస్ మాజీ మండల

పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించండి : మెరుగు మల్లేశం
X

దిశ, పాలకుర్తి: కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు గౌరవం లభించాల్సిందేనని తొర్రూరు కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు మెరుగు మల్లేశం గౌడ్ స్పష్టం చేశారు. శనివారం డివిజన్ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి జోరుగా సాగుతోందన్నారు.

అయితే, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు కాంగ్రెస్‌లోకి చేరి పెత్తనం చేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడిన పాత కార్యకర్తలను విస్మరించకుండా అందరిని కలుపుకొని ముందుకెళ్లాలన్నారు. తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి మాట్లాడిన విషయాలను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఆయన ఝాన్సీ రెడ్డిపై ఎలాంటి విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు.

పార్టీలో వాస్తవానికి కష్టపడిన నాయకులను పక్కన పెట్టి ఇతరుల్ని ఇన్‌చార్జ్‌లుగా నియమించడంపై మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికైనా పునరాలోచన జరగాలి, పాత-కొత్త అనే తేడా లేకుండా అందరికీ గౌరవం ఇవ్వాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలిచి జెండా ఎగురవేయాలి’’ అని టీపీసీసీ ఇంచార్జిగా ఉన్న ఝాన్సీ రెడ్డిని కోరారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు దేవరకొండ శ్రీనివాస్, జాటోత్ బాలు నాయక్, ఎద్దు మహేష్ యాదవ్, వెంకట్, వంశీ, చిట్టిమల్ల మహేష్, ధర్మారపు శీను, సంపత్, పెద్ది ప్రవీణ్ గౌడ్, రాకేష్ ఎనమాల, చంటి, షాబీర్, రాము, రాజు, ప్రశాంత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story