- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > రుణమాఫీపై వినతుల కోసం మండలానికో అధికారిః కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

X
దిశ, బచ్చన్నపేట :రైతులు రుణమాఫీపై వినతులు అందించేందుకు ప్రతి మండలంలో ఒక వ్యవసాయ శాఖ అధికారిని నియమించినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. బచ్చన్నపేట మండలానికి విద్యాకర్ రెడ్డిని నియమించారు. మండలాలలో వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలోనూ రైతు వేదికలోనూ అధికారులు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. ప్రతి రైతు సమస్యను పరిష్కరించే వరకు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఈ విషయమై సంబంధిత అధికారులని మండలాల్లో కలిసి వినతులు అందించవలసిందిగా తెలియజేశారు.
Next Story






