భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

by Ratna Kumari |

జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం పరిశీలించారు.

భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా, సమావేశపు గది,స్టేట్ బోర్డ్,ఛాంబర్,లిఫ్ట్, టాయిలెట్స్,గార్డెనింగ్ సుందరీకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని, పనులలో ఎలాంటి నాణ్యత లోపం ఉండవద్దని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ ను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ ఈ శ్యామ్ సింగ్, గుత్తేదారులు ఉన్నారు.

Next Story