పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం ప్రతి సంస్థ కల్పించాలి

by Ratna Kumari |

జిల్లాలో పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.

పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం ప్రతి సంస్థ కల్పించాలి
X

దిశ, వరంగల్ బ్యూరో : జిల్లాలో పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. మహిళలు వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం వరంగల్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు తమ రాజ్యాంగ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలకు చిన్నప్పటి నుంచే లింగ సమానత్వం, పరస్పర గౌరవం నేర్పించాలని అన్నారు. షీ టీం ప్రతినిధి సుజాత మాట్లాడుతూ మహిళలపై ఎక్కడైనా వేధింపులు జరిగినట్లయితే షీ టీంను 8712685142 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. అనంతరం షి బాక్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు ఎలా నమోదు చేయాలో వివరించారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు.

జిల్లాలో ఇప్పటివరకు జిల్లా స్థాయి కార్యాలయాల్లో 59, మండల, గ్రామస్థాయి కార్యాలయాల్లో 59, ప్రైవేట్ సంస్థల్లో 26 కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డీఎల్ఎస్ఏ అడ్వకేట్ సురేష్ మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపుల కేసుల్లో గోప్యత పాటిస్తూ విచారణ చేపట్టాలని, ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలని వివరించారు. కమిటీలు ఏర్పాటు చేయని సంస్థలకు జరిమానాలు విధించే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోష్ చట్టానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరణ చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత, డీఆర్‌డీఏ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story