రేపు మేడారానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి..

by Disha Web Desk 23 |
రేపు మేడారానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి..
X

దిశ‌,మేడారం బృంధం : మేడారం మ‌హా జాత‌ర‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం మ‌ద్యాహ్నం 12 గంట‌ల‌కు రానున్న‌ట్లు పంచాయ‌తీరాజ్, స్త్రీ శిశు క్షేమ‌మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క తెలిపారు. మేడారం క్యాంపు కార్యాల‌యంలో విలేక‌ర్ల‌తో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి ఉద‌యం 11 గంట‌ల‌కు హైద్రాబాద్ నుండి హెలీకాఫ్ట‌ర్ లో బ‌య‌లుదేరి 12 గంట‌ల‌కు మేడారం చేరుకుంటార‌ని సీత‌క్క తెలిపారు. రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస రెడ్డి, పొన్నం ప్రభాక‌ర్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొంటార‌ని తెలిపారు.

ఉద‌యం 10 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై రాక‌..

శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర రాజ‌న్ మేడారం చేరుకుని స‌మ్మ‌క్క‌ సార‌ల‌మ్మ‌ల‌కు మొక్కులు చెల్లించుకుంటార‌ని సీత‌క్క తెలిపారు. కేంద్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా సైతం జాత‌ర‌కు హాజ‌ర‌వుతార‌ని మంత్రి సీత‌క్క తెలిపారు. ప్ర‌ముఖుల రాక‌ను పుర‌ష్క‌రించుకోని మేడారంలో అదికారులు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు సీత‌క్క తెలిపారు.



Next Story

Most Viewed