- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్ తో పేలిన ఫ్రిడ్జ్...
మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ పక్కనే ఉన్న, చర్చిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిడ్జి పేలిపోయింది.

దిశ, చిట్యాల : మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ పక్కనే ఉన్న, చర్చిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిడ్జి పేలిపోయింది. వస్తువులపై బూడిద పేరుకుపోయింది. చర్చి పాస్టర్ రమేష్ , తన భార్య రజిత, పాప రేష్మను హాస్పటల్ కు తీసుకవెళ్లగా, బాబు రోహిత్ బయట ఆడుకోవడానికి వెళ్లాడు. ఈ సమయంలోనే భారీ శబ్దం వచ్చింది. అయితే.. పేలుడు శబ్దానికి స్థానికులు వచ్చి చూడగా ఇంట్లోంచి పొగలు వస్తున్నాయి. దీంతో.. చుట్టుపక్కల వాళ్ళు పాస్టర్ రమేష్‌కు సమాచారాన్ని అందించారు. వెంటనే పాస్టర్ వచ్చి తలుపులు తీయగా ఫ్రిడ్జ్ పేలిపోయి ఇళ్లు మొత్తం పొగతో నిండి పోయింది. చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో, పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌లో కూడా ఫాన్స్, టీవీలు, కూలర్లు కాలిపోయాయని తెలిపారు. అయితే.. దీనిపై పాస్టర్ రమేష్ మాట్లాడుతూ.. పూర్తి బాధ్యత కరెంటు డిపార్ట్మెంట్ వారే వహించాలని, నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఏఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అక్కడికి వెళ్లి చూడగా, 33 కెవి కింద చర్చికి వచ్చే ఎల్ టి లైన్ ఉందని, ఆ ప్రాంతంలో పక్షుల ఆనవాళ్లు గాని, భారీ వాహనాలు గాని వెళ్లలేదని, ఒకవేళ మనుషుల వలన జరిగితే జరగాలని, చుట్టుపక్కల వారిని విచారించగా ఎవరు చెప్పలేదన్నారు






