అత్తింటి వారి ఒత్తిడి.. వివాహిత మృతి..!

by Bhanu |   (  Updated:2025-05-05 15:33:26  IST  )

అత్తింటి వారి ఒత్తిడి వలనే తన కూతురు మానసికంగా కృంగిపోయి, ఆత్మహత్య చేసుకుందని, మృతురాలి తండ్రి కందికొండ శంకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అత్తింటి వారి ఒత్తిడి..  వివాహిత మృతి..!
X

దిశ, చిట్యాల: అత్తింటి వేధింపుల కారణంగా తన కుమార్తె మనోవేదనతో ఆత్మహత్య చేసుకుందన్న మురళిపల్లి గ్రామానికి చెందిన కందికొండ శంకర్‌ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు ఆయన చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం, శంకర్ కుమార్తె నిరోషా గత సంవత్సరం దేశాయిపేటకు చెందిన ముదిగొండ ప్రశాంత్‌తో వివాహం జరిగింది. దంపతులకు 18 రోజుల పాప ఉంది. ఇటీవల పురుడు చేయించేందుకు ప్రశాంత్, ఆయన తల్లి లక్ష్మి కలిసి అత్తారింటికి వచ్చారు. అయితే, వారి వంశంలో పురుడు చేయడం సంప్రదాయం లేదని చెప్పిన సమయంలో అల్లుడు శ్రీకాంత్, లక్ష రూపాయలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. డబ్బు ఇవ్వలేకపోయిన శంకర్ దీనిపై అభ్యంతరం తెలపడంతో గొడవ జరిగిందని పేర్కొన్నారు.

అదే రోజు ప్రశాంత్, నిరోషాతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, నిరోషా ఇంట్లో వ్యవసాయానికి ఉపయోగించే విషం తా ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స మధ్యలో అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది. ఈ విషాద ఘటనపై నిరోషా తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ప్రశాంత్, అతడి తల్లి లక్ష్మి, తండ్రి సాంబయ్య, శ్రీకాంత్‌లపై మానసికంగా వేధింపులకు గురి చేశారన్న అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాదం తల్లిదండ్రులను కన్నీళ్లలో ముంచేసింది. యువతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story