పిల్ల‌ల‌ను అంగ‌న్ వాడీల‌లో చేర్పించాలి : మంత్రి కొండా సురేఖ

by Ratna Kumari |

బాలలకు భరోసా అవసరం, పిల్లలను అంగన్ వాడీల‌లో చేర్పించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు.

పిల్ల‌ల‌ను అంగ‌న్ వాడీల‌లో చేర్పించాలి :   మంత్రి కొండా సురేఖ
X

దిశ, వరంగల్ బ్యూరో : బాలలకు భరోసా అవసరం, పిల్లలను అంగన్ వాడీల‌లో చేర్పించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 5వ థీమ్‌గా ‘చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ డ్రగ్స్‌కు నో’ అనే భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలలకు భ‌రోసా ఎంతో అవసరం అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పోషకాహారం తీసుకోవాలని పేర్కొన్నారు.


సరైన పోషణ ఉన్నప్పుడే పిల్లలు శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ చిన్నారులకు ముందస్తుగా హెల్త్ స్క్రీనింగ్ చేయించడం ద్వారా అభివృద్ధి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించవచ్చని అన్నారు. అందువల్ల పిల్లలకు నిరంతర ఆరోగ్య పరీక్షలు చేయించడం అత్యంత అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story