- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో పెళ్లి.. షాకిచ్చిన అధికారులు..!
వేడుకలు మొదలయ్యాయి కళ్యాణ మండపంలో హరికథల మాదిరిగా సంగీతం, అతిథుల రాకపోకలు పెళ్లికొడుకు రాకతో ముస్తాబై వేదికపైకి అడుగుపెట్టబోతున్న సమయంలో…

దిశ, హనుమకొండ : వేడుకలు మొదలయ్యాయి కళ్యాణ మండపంలో హరికథల మాదిరిగా సంగీతం, అతిథుల రాకపోకలు పెళ్లికొడుకు రాకతో ముస్తాబై వేదికపైకి అడుగుపెట్టబోతున్న సమయంలో… ఊహించని విధంగా రంగంలోకి దిగిన పోలీసులు షాక్ ఇచ్చారు. హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం మైనర్ బాలికకు వివాహం జరుగుతుందన్న సమాచారంతో రంగంలోకి దిగిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు, చైల్డ్ లైన్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
పెళ్లి కార్యక్రమం ఆపి, మైనర్ బాలికను కాపాడి, మైనర్ అబ్బాయిని కూడా రక్షించారు. ఇద్దరి తల్లిదండ్రులను సి.డబ్ల్యూ.సి. (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ముందు హాజరు పరచగా, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో సత్వర చర్య తీసుకున్న అధికారులు మరో బాల్య వివాహాన్ని ఆపటంతో ప్రశంసలందుకుంటున్నారు.






