కొనుగోలు పత్రాలు ఇవ్వకపోతే సీఈఓ లను సస్పెండ్ చేస్తాం

by Ratna Kumari |

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుకు కొనుగోలు పత్రం ఇవ్వకపోతే సిఈఓ లను సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.

కొనుగోలు పత్రాలు ఇవ్వకపోతే సీఈఓ లను సస్పెండ్ చేస్తాం
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుకు కొనుగోలు పత్రం ఇవ్వకపోతే సిఈఓ లను సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండలం ఎస్ ఎం కొత్తపల్లి , చిట్యాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తడిచిన ధాన్యాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ తోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు దాన్యం కొనుగోలు పత్రాలను కచ్చితంగా అందజేయాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు కొనుగోలు పత్రాలు అందించకపోతే సంబంధిత సీఈఓ లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.


కొనుగోలు కేంద్రాలలో హమాలీల సంఖ్య పెంచాలని మాయిచ్చర్వచ్చినధాన్యాన్నిఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లలకు లారీలలో తరలించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు. మన జిల్లాలో ఇప్పటికే 90% మక్కల కొనుగోలు పూర్తయిందని జిల్లాలో అదనంగా గోదాములుగా ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ధాన్యం తడవకుండా టార్పాలిన్లుతో కప్పి ఉంచాలని తెలిపారు. కాంట అయిన ధాన్యాన్ని రైతులు తమ సొంత ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించుకోవచ్చని రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు అవకతవకలు పాల్పడితే వ సస్పెండ్ చేస్తామని క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సివిల్ సప్లై అధికారి కిరణ్ కుమార్, జిల్లా కోపరేటివ్ అధికారి వాలియా నాయక్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు.

Next Story