- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ యాంత్రికరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం
వ్యవసాయ యాంత్రికరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.

దిశ, ధర్మసాగర్ : వ్యవసాయ యాంత్రికరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా పరిధిలోని ధర్మసాగర్, వేలేరు మండలాలకు సంబంధించిన 12మంది లబ్ధిదారులకు 50శాతం సబ్సిడీపై రోటవెటర్స్, బేయిలర్స్, స్ప్రేయర్స్ వంటి వ్యవసాయ పనిముట్లను లబ్ధిదారులకు పంపిణి చేశారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదని, వ్యవసాయ పెట్టుబడి భారం అవుతుందని అన్నారు. అందుకే ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ పనులకు యంత్రికరణ చేసేందుకు ప్రోత్సహం అందిస్తోందని తెలిపారు. వ్యవసాయ యంత్రికరణకు 50శాతం సబ్సిడీతో పనిముట్లను ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ యంత్రికరణ పద్ధతులను రైతులు పాటించాలని తెలిపారు. వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పని చేస్తుందని అన్నారు. రుణ మాఫీ, సన్నాలకు బోనస్, రైతు భరోసా, ఉచిత విద్యుత్, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక, యాంత్రికరణ మార్పులు వస్తున్నాయని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు యాంత్రిక పద్ధతులు పాటించాలని సూచించారు. రైతులు వరి పంటనే ఎక్కువగా వేస్తున్నారని అలా కాకుండా ఇతర వాణిజ్య పంటలను వేస్తే కొంత లాభసాటిగా ఉంటుందని వెల్లడించారు. అలాగే వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రీ రంగాలపై కూడా దృష్టి పెట్టాలని దీనివల్ల అదనపు ఆదాయం సమాకూరుతుందని పేర్కొన్నారు. హన్మకొండ జిల్లాలో ధర్మసాగర్, వేలేరు మండలాలు పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడిన మండలాలని కావున సబ్సిడీ యంత్రాల కేటాయింపులో ఈ రెండు మండలాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారులను కోరారు. డ్రోన్ స్ప్రేయర్స్ లను వ్యక్తులకు కాకుండా రైతు సంఘాలకు మహిళా సంఘాలకు గ్రామానికి ఒకటి చొప్పున కేటాయించాలని అన్నారు. ప్రభుత్వాలు రైతులకు ఎంత చేసినా తక్కువేనని రైతులు పండించిన పంట చేతికి వచ్చిన నోటికి రావడం లేదని అన్నారు. ఎన్ని చేసినా వ్యవసాయం లాభసాటిగా మారడం లేదని తెలిపారు. స్వామినాధన్ కమిషన్ నివేదిక ను యథాతదంగా అమలు చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఏడిఏవో, ఏవోలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






