గంజాయి పట్టివేత..!

by Ratna Kumari |

వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో గంజాయి పట్టుబడినట్లు సమాచారం.

గంజాయి పట్టివేత..!
X

దిశ, ఖానాపురం : వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో గంజాయి పట్టుబడినట్లు సమాచారం. విశ్వాసనీయ సమాచారం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన ఇద్దరు యువకులు ద్వి చక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్నారు. మహబూబాబాద్ మీదుగా వయా నర్సంపేట ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఖానాపురం పెట్రోల్ బంక్ దగ్గరలో పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. గంజాయిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి తరలిస్తున్నారు. దాదాపు 10 ప్యాకెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయి సుమారు 20 కిలోలు ఉన్నట్లు సమాచారం. ఇద్దరు యువకులు సహా బైక్, రెండు సెల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Next Story