- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > వరంగల్ > ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్యకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ
ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్యకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ
టీజీఎస్ ఆర్టీసీ నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ బస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన పై ఆవేదన చెందుతున్నామని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు.

X
దిశ, హన్మకొండ టౌన్ : టీజీఎస్ ఆర్టీసీ నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ బస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన పై ఆవేదన చెందుతున్నామని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారికి ఘన నివాళులు అర్పించుటకు ఈ రోజు సాయంత్రం హనుమకొండ బస్ స్టేషన్ నుంచి అదాలత్ జంక్షన్‌లోని కాళోజీ అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో టి.జి.ఎస్.ఆర్.టి.సి కార్మికులు, కార్మిక నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు మరియు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.
Next Story






