కెనాల్ భూములపై నిర్లక్షం వీడని ఇరిగేషన్ అధికారులు.. చేస్తాం... చూస్తాం అంటున్న ఇరిగేషన్ డిఈ

by Bhanu |

కెనాల్ భూముల రక్షణకు ఇరిగేషన్ అధికారుల కాలు ముందుకు కదలడం లేదు.

కెనాల్ భూములపై నిర్లక్షం వీడని ఇరిగేషన్ అధికారులు.. చేస్తాం... చూస్తాం అంటున్న ఇరిగేషన్ డిఈ
X

దిశ, గీసుగొండ : కెనాల్ భూముల రక్షణకు ఇరిగేషన్ అధికారుల కాలు ముందుకు కదలడం లేదు. కోట్లు విలువ చేసే భూములు కబ్జాలకు గురవుతున్న నిర్లక్ష్యం వీడని ఇరిగేషన్ అధికారులు. గత శనివారం దిశ దినపత్రికలో కెనాల్ భూములు మాయం అనే శీర్షిక భూములు కబ్జా అవుతున్నాయని కళ్ళకు కట్టినట్టు తెలిపినా కాలు కదుపని యంత్రాంగం.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు

కెనాల్ మట్టి తోడుకోవడానికి అనుమతుల కోసం ఇరిగేషన్ శాఖ అధికారులను సంప్రదిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన సదరు అధికారులు అవేమీ లేకుండానే రాజకీయ నాయకుల ప్రలోభాలతో అనుమతులు ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెనాల్ భూమి ఆక్రమించి ఫిష్ పాండ్ తీసిన అధికార పార్టీ నాయకుడు,ఆ ఫిష్ పాండ్ పూడ్చడానికి కెనాల్ మట్టికి అనుమతులు తీసుకున్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అసలు విషయం బయట పడేది. కానీ అధికార పార్టీ నాయకుడి ప్రలోభాలకులోనై క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి.

చేస్తాం..చూస్తాం..అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ డిఈ

కెనాల్ భూములు కబ్జాకు గురవుతున్నాయని వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారని దిశ ప్రతినిధి ఇరిగేషన్ డిఈ వేణుగోపాల్ ను చరవాణిలో సంప్రదించగా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నాడు. చేస్తాం.. చూస్తామంటూ... కాలం వెళ్లి తీసే మాటలు మాట్లాడుతున్నాడు.నేను ఇక్కడికి రాకముందు నుండి కబ్జాలు జరిగాయని నేను ఇప్పుడు ఏం చేయాలంటూ నిర్లక్ష్యంపు సమాధానం ఇస్తున్నాడు. బాధ్యతాయుతంగా పని చేయాల్సిన జిల్లా స్థాయి అధికారి అంటిముంట నట్టు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏంటనదే అసలు ప్రశ్న...

ప్రతిపాదనలు పంపితే చర్యలకు సిద్ధం: గీసుగొండ తహసిల్దార్ రియాజుద్దీన్

ఇరిగేషన్ శాఖ నుండి తమకు ఎలాంటి ప్రతిపాదనలు ఇంతవరకు అందలేదని ఆ శాఖ నుండి ప్రతిపాదనలు అందితే వెంటనే సర్వే చేసి,హద్దులు వేస్తామన్నారు. స్థానిక పోలీసు శాఖ వారి సహకారంతో గుడిసెలు ఖాళీ చేయిస్తామని, కెనాల్ భూముల కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని గీసుగొండ తహసిల్దార్ ఎండీ రియాజుద్దీన్ తెలిపారు.

Next Story