- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామలో చోరీ.. బంగారు గాజులు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
by Ratna Kumari |
జనగామ పట్టణంలోని పిస్టన్ ప్రాంతంలో చోరీ చోటు చేసుకుంది. జన్న సిద్ధేశ్వరి ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు.

X
దిశ, జనగామ : జనగామ పట్టణంలోని పిస్టన్ ప్రాంతంలో చోరీ చోటు చేసుకుంది. జన్న సిద్ధేశ్వరి ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 9.30 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి వారి అమ్మవారు మరణించడంతో టెంపుల్‌కు నిద్ర చేయడానికి వెళ్లారు. రాత్రి సుమారు 1.30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి ఉన్నట్లు గమనించారు. అనంతరం ఇంట్లో ఉన్న బీరువా తాళాలు కూడా పగలగొట్టి అందులో ఉన్న సుమారు 5 తులాల నాలుగు బంగారు గాజులు, రూ.80 వేల నగదును గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






