- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇష్టారీతిన బీటీ రోడ్డు పనులు
మండలంలోని మైలారం గ్రామంలో హుస్సేన్ పల్లి నుంచి మైలారం పెద్ద చెరువు కట్ట వరకు చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అడ్డుకుని, ఎమ్మెల్యే అండదండలతో పనులను తనకు ఇష్టం వచ్చిన విధంగా చేపట్టాలని కాంట్రాక్టర్ ను బెదిరిస్తున్నారని మైలారం మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ గడిపె విజయ విజయ్ కుమార్ ఆరోపించారు.

ఇష్టారీతిన బీటీ రోడ్డు పనులు
- తనకు నచ్చినట్లే పనులు చేయాలంటూ కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్న కాంగ్రెస్ నేత
- మైలారం మాజీ సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్ ఆరోపణ
దిశ,శాయంపేట : మండలంలోని మైలారం గ్రామంలో హుస్సేన్ పల్లి నుంచి మైలారం పెద్ద చెరువు కట్ట వరకు చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అడ్డుకుని, ఎమ్మెల్యే అండదండలతో పనులను తనకు ఇష్టం వచ్చిన విధంగా చేపట్టాలని కాంట్రాక్టర్ ను బెదిరిస్తున్నారని మైలారం మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ గడిపె విజయ విజయ్ కుమార్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీటీ రోడ్డు పనులకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హయాంలో 2023లో రూ. కోటి 60 లక్షల సీఆర్ఆర్ నిధులు మంజూరైనప్పటికీ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాల్సిన విధంగా కాకుండా బుచ్చిరెడ్డి తన స్వలాభం కోసం తన భూమి దగ్గరికి వచ్చే రోడ్డును చెరువులోకి వంకరగా పోయించాడని, దాదాపు 200 మీటర్ల పొడవున చెరువు లోపల13 ఫీట్లు వెడల్పుతో రోడ్డు పోయించాడన్నారు. దళితులకు సంబంధించిన గోరీలను కూల్చి కొంత భూమిని తన వ్యవసాయ భూమిలో కలుపుకున్నాడు. రైతులు యథావిధిగా వెళ్లే బాటలో నుంచి కూడా వారిని వెళ్లనివ్వడం లేదని చెప్పారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి పనులు సక్రమంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
మండల అధ్యక్షుడు నన్ను బెదిరించలేదు.. పనులు ఆపింది వాస్తమే : కాంట్రాక్టర్
ఈ విషయమై దిశ విలేకరి కాంట్రాక్టర్ ను సంప్రదించగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి నన్ను బెదిరించలేదని కానీ పనులు ఆపింది వాస్తవమే అన్నారు. మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి ఆయన పొలం దగ్గర జెసిబి తో దాదాపుగా రెండు మీటర్ల వరకు కట్టను కట్ చేశాడని,ఆయన పొలం దగ్గర కట్ట నిర్మాణ పనులు ఆపిండని తెలిపారు.
రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక చౌకబారు విమర్శలు : కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి
రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి తెలిపారు. నాకు నా తమ్ముళ్లకు కలిపి మూడు ఎకరాలు ఉందని రోడ్డు వెడల్పు చేసే క్రమంలో ఒక ఎకరంలో మొరం పడ్డదని మిగతా రెండు ఎకరాల్లో కట్ట వెడల్పు ఉంది కాబట్టి కాంట్రాక్టర్ సెంటర్లోకి తీసుకెళ్లాడని తెలిపారు. వాళ్లు కలుపుకున్న ప్రభుత్వ భూములను వదిలిపెడితే నాకు ఉన్న మొత్తం భూములు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.






