బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : కొమ్మనబోయిన వేణు యాదవ్

by Bhanu |

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు అన్నారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : కొమ్మనబోయిన వేణు యాదవ్
X

దిశ, కొత్తగూడ: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు అన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జంగా మౌనిక, జంగా నవ్యలత కుటుంబాలను శుక్రవారం ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి ఆదేశానుసారం బాధిత కుటుంబాలను బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మండల పార్టీ నేతలు పరామర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఈ సందర్భంగా ఆ కుటుంబానికి రూ.53,000ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొమ్మన బోయిన వేణు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాస్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి బానోత్ నెహ్రూ, పార్టీ సీనియర్ నాయకులు ఢిల్లీ మోహన్ రావు, గజ్జి కొమురెల్లి, మండల యూత్ అధ్యక్షుడు గూగులోత్ సురేష్, భూపతి తిరుపతి, ఏటుకూరి శ్రీను, అజ్మీరా రమేష్, బొల్లు రవి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కాసర్ల సాంబయ్య, బోళ్ల అనిల్, గజ్జి సాయి, ఎంపీటీసీ లింగన్న, బోడ దేవ్ సింగ్, బండి శివ, ఫుల్సమ్ రమేష్, బిరెల్లి శ్రీధర్, జల్లి మురళి, కడబోయిన యాకయ్య, గూడెల్లి మల్లయ్య, అనిల్ రెడ్డి, బోడ రవి, పత్తిపాక వెంకన్న చారి తదితరులు పాల్గొన్నారు.


Next Story