బీజేపీ జెండా గద్దెకు బీఆర్ఎస్ ఫ్లెక్సీ.. తొలగించిన బీజేపీ మహిళా కార్యకర్తలు

by Disha Web Desk 7 |
బీజేపీ జెండా గద్దెకు బీఆర్ఎస్ ఫ్లెక్సీ.. తొలగించిన బీజేపీ మహిళా కార్యకర్తలు
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డులో సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్డు పర్యటనలో భాగంగా స్థానిక నాయకులు బీజేపీ జెండా కర్రకు ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు స్వాగతం పలికే ఫ్లెక్సీలను కట్టారు. అది గుర్తించిన బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులకు తెలియజేసినప్పటికి తొలిగించలేదని తెలిపారు. దింతో చేసిందేమి లేక బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షరాలు ఇందు భారతీ తొలిగించింది. బీఆర్ఎస్ పార్టీని, నాయకులను ప్రజలు గమనిస్తున్నారని ఆమె తెలిపింది.

Next Story

Most Viewed