అసెంబ్లీలో ఆ పదం అనవద్దని రూలింగ్ ఇప్పించారు: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-27 14:44:19  IST  )

తెలంగాణ పదాన్ని ఆ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉమ్మడి అసెంబ్లీలో నిషేధించారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు...

అసెంబ్లీలో ఆ పదం అనవద్దని రూలింగ్ ఇప్పించారు: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana) పదాన్ని ఆ నాడు ముఖ్యమంత్రి(Chief Minister)గా ఉన్న చంద్రబాబు(Chandrababu) ఉమ్మడి అసెంబ్లీ(Assembly)లో నిషేధించారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Former CM and BRS leader KCR) గుర్తు చేశారు. వరంగల్ ఎల్కతుర్తి(Warangal Elkathurthi)లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ఎంత గోస, దు:ఖం, వేదన, హింస, అణచివేత అనుభవించిందో అందరికి తెలుసు. గోదావరి, కృష్ణా నీళ్లు తరలిపోతే తల్లి చనుపాలకు నోచని పిల్లల్లా తెలంగాణ బిడ్డలు రోదించారు. కరువులు, కాటకాలకు గురయ్యారు. అర్ధరాత్రి కరెంట్ పోయి, పాములు కుట్టి, తేళ్లు కుట్టి చాలా భయంకరంగా అనాథల్లా చనిపోయారు. ఆ నాడు కాంగ్రెస్(Congress), టీడీపీ(Tdp)లో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు. ఏనాడూ కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాక తెలంగాణ సోయ కూడా ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ నేతలు పదవులు త్యాగం చేశారు. పదవుల కోసం తెలంగాణను కాంగ్రెస్ నాయకులు ఆగం చేశారు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారు. వరంగల్ జిల్లాకు చెందని ప్రణయ్ భాస్కర్ అసెంబ్లీలో తెలంగాణ అన్నారు. అది నేరమైనట్టుగా పరిగణించారు. తెలంగాణ పదాన్నే నిషేధించే ప్రయత్నం చేశారు.’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story