- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొలెరో బోల్తా.. మంటలు అంటుకొని దగ్దం
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గువ్వలబోడు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడి పూర్తిగా దగ్ధమైంది.

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గువ్వలబోడు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సంపేట నుంచి గంగారం వైపు బార్దాన్ (గన్నీ బ్యాగులు) లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట నుంచి గంగారం వైపు వెళ్తున్న మొక్కజొన్నకు ఉపయోగించే గన్నీ బ్యాగులు తీసుకెళ్తున్న బొలెరో వాహనం చిలకమ్మ నగర్ పరిసరాల్లోకి రాగానే రోడ్డు పక్కన మండుతున్న అడవి ఎర్రగడ్డి మంటలు వాహనం పై ఉన్న బార్దాన్ పై పడి అంటుకున్నట్లు సమాచారం.
వాహనం వేగంగా ప్రయాణిస్తుండటంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. గేదవాగు సమీపానికి చేరుకునేసరికి డ్రైవర్ అద్దంలో చూసి మంటలను గమనించాడు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు మళ్లించే ప్రయత్నం చేయగా.. అదే సమయంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. క్షణాల్లోనే వాహనం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సుధాకర్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.






