బొగతకు గ్రీన్ సిగ్నల్… ఇతర గుట్ట జలపాతాలకు స్ట్రిక్ట్ వార్నింగ్

by Bhanu |

వర్షాకాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బొగత జలపాతాన్ని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చినట్టు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వెల్లడించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులు బొగత జలపాతానికి రావాలని ఆయన సూచించారు.

బొగతకు గ్రీన్ సిగ్నల్… ఇతర గుట్ట జలపాతాలకు స్ట్రిక్ట్ వార్నింగ్
X

దిశ, ములుగు ప్రతినిధి: వర్షాకాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బొగత జలపాతాన్ని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చినట్టు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వెల్లడించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులు బొగత జలపాతానికి రావాలని ఆయన సూచించారు.

అయితే, ఇటీవల సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లో బొగత పరిసర అటవీ ప్రాంతాల్లోని కొన్ని అజ్ఞాత గుట్ట జలపాతాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయని ఆయన చెప్పారు. వీటి ప్రభావంతో అక్కడికి వెళ్లే ప్రయత్నాల్లో కొంతమంది పర్యాటకులు ప్రమాదానికి లోనవుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఈ దాగి ఉన్న జలపాతాలు శారీరకంగా చేరుకోవడం ఎంతో కష్టంగా ఉండడంతో పాటు మార్గం ప్రమాదకరమైనదని అటవీశాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా బొగత జలపాతాన్ని మినహాయించి ఇతర అన్ని అక్రమ గుట్ట జలపాతాల సందర్శనపై పూర్తిస్థాయి నిషేధం విధించామని అధికారులు స్పష్టం చేశారు. అధికార సూచనలను పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించినవారిపై తెలంగాణ రాష్ట్ర అటవీ చట్టం–1967 సెక్షన్ 20 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ హెచ్చరించారు.

Next Story