- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గట్లనర్సింగాపూర్ వద్ద బైక్ ప్రమాదం.. వ్యక్తి మృతి
మండలంలోని గట్లనర్సింగాపూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

దిశ, భీమదేవరపల్లి : మండలంలోని గట్లనర్సింగాపూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం ప్రకారం.. మృతుడు జగన్నాథపురానికి చెందిన చిర్ర సుదర్శన్ (51) కాగా, వృత్తిరీత్యా ఆర్.ఎం.పీ.గా సేవలందించడంతో పాటు రిపోర్టర్‌గా కూడా పని చేస్తున్నారు.
జూన్ 22వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో హుస్నాబాద్‌లో జరిగిన బంధువుల ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, గట్లనర్సింగాపూర్ శివారులోని రోడ్డు కల్వర్ట్ వద్ద (3వీ × 1 కాలువ సమీపంలో) ఆయన ప్రయాణిస్తున్న TS03EZ5058 నెంబర్ బైక్ అదుపు తప్పి కిందపడి తలపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు చిర్ర విజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ముల్కనూరు ఎస్సై నండ్రు సాయిబాబు తెలిపారు.






