- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయ్యారం ఫారెస్ట్ రేంజ్ పరిదిలో పెద్ద పులి సంచారం..?
బయ్యారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచరించినట్టు స్థానికులు తెలిపారు.

దిశ, బయ్యారం : బయ్యారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచరించినట్టు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా బయ్యారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొట్ల తిమ్మాపురం బీట్ ఈస్ట్ పరిధిలో కొత్తపేట బీట్ నగరం బీట్ లో నీళ్ల బావి తోగు ఈస్టు బీట్ ప్రాంతంలో పులి సంచరించినట్టు సమాచారం. పాద ముద్రలను గుర్తించిన స్థానికులు నుండి ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు మూడు రోజుల నుంచి తిమ్మాపురం బీట్ పరిధిలో పులి సంచారం చేసినట్లు సమాచారం. రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని ఉన్న గ్రామాల్లో ప్రజలకు అడవి జంతువుల రక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్వే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఫారెస్ట్ పరిధిలో పులుల సంచారం సమగ్ర సర్వే ఏవిధంగా చేపడుతారో వేచి చూడాలి మరీ. మరోవైపు బయ్యారం ఇన్ చార్జి డీఆర్ఓ రమేష్ ను వివరణ కోసం ఫోన్ లో సంప్రదించగా.. స్పందించకపోవడం గమనార్హం.






