భూపాల్ ప‌ల్లి మున్సిపాలిటీ చైర్మ‌న్ బుర్ర కొముర‌య్య గౌడ్

by Ratna Kumari |

భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండో వార్డు కౌన్సిలర్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

భూపాల్ ప‌ల్లి మున్సిపాలిటీ చైర్మ‌న్ బుర్ర కొముర‌య్య గౌడ్
X

దిశ‌, భూపాల‌ప‌ల్లి ప్ర‌తినిధి : భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండో వార్డు కౌన్సిలర్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 16 వార్డు ల్లో గెలుపొందగా బీఆర్ఎస్ 10 వార్డు ల్లో గెలుపొందింది బీజేపీ రెండు వార్డులలో స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో సీపీఎం 1వార్డులో గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైనది. కౌన్సిలర్లతో మున్సిప‌ల్ కమిషనర్ జోన ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశం బహిష్కరించి వెళ్లిపోయారు. మున్సిపల్ లీడర్ గా గండ్ర హరీష్ రెడ్డి భూపాల్ పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ గండ్ర హరీష్ రెడ్డిని ఆ పార్టీ కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం హరీష్ రెడ్డిని ప్రకటించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిలో తాము సహకరిస్తామని తెలిపారు.

Next Story