- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్టాప్ గుడారాలే నివాసం..
దిశ, భీమదేవరపల్లి : పట్టణాల విస్తరణ, అడవుల తగ్గుదలతో తమకంటూ ఒక చిన్న గూడు కూడా దొరకని పరిస్థితుల్లో పిట్టల కులస్తుల జీవనం నేటికీ అరణ్య వాసననే మోస్తోంది. ఏండ్లుగా

దిశ, భీమదేవరపల్లి : పట్టణాల విస్తరణ, అడవుల తగ్గుదలతో తమకంటూ ఒక చిన్న గూడు కూడా దొరకని పరిస్థితుల్లో పిట్టల కులస్తుల జీవనం నేటికీ అరణ్య వాసననే మోస్తోంది. ఏండ్లుగా సంచార జీవితం గడుపుతున్న ఈ కులస్తులకు భీమదేవరపల్లి క్రాస్ వద్ద ఉన్న బస్టాప్ ఒక్కటే ఆశ్రయంగా మారింది. ఇక్కడ బస్టాప్ గుడారాలను తాత్కాలిక నివాసాలుగా మార్చుకుని, పిల్లాపాపలతో కలిసి పిట్టల కులస్తులు జీవనం కొనసాగిస్తున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి అన్న తేడా లేకుండా వాతావరణ మార్పులను తట్టుకుంటూ, అదే బస్టాప్‌ను తమ ఇంటిగా భావిస్తున్నారు. ప్రయాణికుల రాకపోకల మధ్యే వారి రోజు మొదలై, అదే చోట ముగుస్తోంది. ఈ దృశ్యం అక్కడుగా వెళ్లే వారికి కనువిందుగా అదే సమయంలో మనసును కదిలించే వాస్తవంగా నిలుస్తోంది.
పొద్దున్నే లేచి సమీప అడవుల్లో దొరికే పదార్థాలు, అడవి ఫలాలు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి శాశ్వత నివాసం అన్నది కలగా మిగిలిపోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆశ్రయం, పునరావాసం లేకపోవడంతో బస్టాప్‌లే వీరి బతుకులకు నిలువనీడలుగా మారాయి. స్థానికులు మాట్లాడుతూ “కనీసం బస్టాప్‌లో గుడారాలు వేసుకుని ఉండడం వల్లైనా వీరికి కొంత భద్రత లభిస్తోంది. ఇది చిన్న ప్రయత్నమే అయినా, పిట్టల కులస్తుల ఉనికిని కాపాడే మార్గంగా మారింది” అని అభిప్రాయపడుతున్నారు. ఇండ్లు స్థిర నివాసం లేని పిట్టల కులస్తులను గుర్తించి, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహాలు మంజూరు చేసి శాశ్వత నివాసం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.






