రిజర్వేషన్ సాధనకు బీసీలు రాజకీయ లడాయికి సిద్ధం కావాలి

by Elthuri vijay kumar |

సీ రిజర్వేషన్లు 42 శాతం సాధించేందుకు బీసీలు రాజకీయ లడాయికి సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

రిజర్వేషన్ సాధనకు బీసీలు రాజకీయ లడాయికి సిద్ధం కావాలి
X

రిజర్వేషన్ సాధనకు బీసీలు రాజకీయ లడాయికి సిద్ధం కావాలి

- పార్టీలు బీసీ బిల్లుకు నోటితో మద్దతు ఇస్తూ, నొసటితో వ్యతిరేకిస్తున్నాయి

- 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోంది

- దసరాలోపు రిజర్వేషన్లు అమలు చేయకుంటే బీసీల సత్తా చాటుతాం

- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

దిశ తొర్రూర్ : బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధించేందుకు బీసీలు రాజకీయ లడాయికి సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు నోటితో మద్దతు తెలుపుతూ, నొసటితో వ్యతిరేకిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నా, దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కనీసం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయాలని, ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా రిజర్వేషన్ కోసం డిమాండ్ చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రం నుంచి ఉన్న బీజేపీ నాయకులు కేంద్రానికి వినతిపత్రం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.అగ్రవర్ణాలకు 9 శాతం ఉన్నప్పటికీ 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. అయితే 60 శాతం జనాభా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు? దసరా పండగ లోపు రిజర్వేషన్లు అమలు చేయకుంటే, భువనగిరిలో లక్షలాది బీసీలతో బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటుతాం అని జాజుల హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైరి రవికృష్ణ, కేయూ ప్రొఫెసర్ సంగీని మల్లేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదగాని సోమయ్య, జిల్లా అధ్యక్షుడు గుండ గాని వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు ప్రభాకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు బసనబోయిన మురళి యాదవ్, నాయకులు తాళ్లపల్లి బిక్షం గౌడ్, నిమ్మల వెంకన్న గౌడ్, బొమ్మన బోయిన వెంకన్న యాదవ్, లింగమూర్తి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు...

Next Story