చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

by Bhanu |

కేంద్ర ప్రభుత్వానికి సామాజిక న్యాయం పై చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
X

దిశ లింగాలఘణపురం( స్టేషన్ ఘన్ పూర్) : కేంద్ర ప్రభుత్వానికి సామాజిక న్యాయం పై చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని, ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు సామాజిక న్యాయం జరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీ కులగణన చేపట్టినన్నారు . బీసీ 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, శాసనసభలో తీర్మానం చేసి పంపించిన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేదన్నారు. ప్రధానమంత్రి బీసీ అయి ఉండి కూడా చేసింది ఏమీ లేదన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి, అన్ని రాష్ట్రాల కంటే ముందుగా షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని ప్రకటించింది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా దళితులకు సముచిత స్థానం దక్కలేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలలో కూడా దళితులకు అన్యాయం జరిగిందని, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 15 మందితో కూడిన మంత్రివర్గంలో నలుగురు మంత్రులు శాసనసభ స్పీకర్ దళితుడే అన్నారు. జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అందాలన్నారు.13వేల 500కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 3కోట్ల 10లక్షల మందికి ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికే రోల్ మాడల్ నిలిచిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన, అభివృద్ధి ఆగదు అన్నారు, విప్లవాత్మకమైన సంక్షేమ పథకాల అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలు చెప్పే కల్లబొల్లి మాటలు, ప్రజలు నమ్మరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జూకుంట్ల శిరీష్ రెడ్డి, బెల్దే వెంకన్న, నరేందర్ రెడ్డి, సారంగపాణి, గట్టయ్య, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు

Next Story