బీజేపీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం..మంత్రి బండి సంజ‌య్‌

by Bhanu |

బీజేపీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అన్నారు.

బీజేపీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం..మంత్రి బండి సంజ‌య్‌
X

దిశ‌, హ‌న్మ‌కొండ : బీజేపీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అన్నారు. క్ర‌మ శిక్ష‌ణ క‌లిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను కాపాడుకునేందుకు తాను ఎంత వ‌ర‌కైనా వ‌స్తాన‌ని అన్నారు. హ‌న్మ‌కొండ జిల్లా వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన కొంత‌మంది నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆదివారం రాత్రి క‌రీంన‌గ‌ర్‌లో బండి సంజ‌య్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. త‌న‌ను క‌లిసేందుకు ప్ర‌త్యేకంగా వ‌చ్చిన అభిమానుల‌ను, నేత‌ల‌ను బండి సంజ‌య్ అభినందించారు. పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని, క్ర‌మ శిక్ష‌ణ‌, అంకితాభావంతో ప‌నిచేసిన వారికి బీజేపీలో త‌ప్ప‌కుండా గుర్తింపు ల‌భిస్తుంద‌ని అన్నారు. అందుకు ప్ర‌ధాన‌మంత్రి మోదీ, త‌న ప్ర‌స్థాన‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. బీజేపీ సామాన్య కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తున్న‌ట్లుగా అనుకుని ముందుకెళ్లాల‌ని, అలాంటి నిరాండంబ‌ర‌తే ప్ర‌జ‌ల్లో, పార్టీలో గుర్తింపు ద‌క్కేలా చేస్తాయ‌ని సూచించారు. హ‌న్మ‌కొండ జిల్లాకు రావాల‌ని శ్రేణులు కోర‌గా.. త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని అన్నారు. సంజ‌య్‌ను క‌లిసిన వారిలో గోపీ కృష్ణ పేరo, చీకటి సతీష్, కలవచర్ల వీరాచారి, గుంటి శ్యామ్, కొత్తపెళ్లి రాజ్ కుమార్, సునీల్ , విజయ్ , అభిషేక్ ,ధనుష్ ,వినయ్ , రాహుల్, త‌దిత‌రులు ఉన్నారు.

Next Story