కాళేశ్వరాన్ని అద్బుతమైన అధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: బండి సంజయ్

by Bhanu |

తెలంగాణ రాష్ట్రంలో కాశి క్షేత్రం గా ప్రసిద్ధిగాంచిన కాలేశ్వరాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోoశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.

కాళేశ్వరాన్ని అద్బుతమైన అధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: బండి సంజయ్
X

దిశ, మల్హర్(కాలేశ్వరం): తెలంగాణ రాష్ట్రంలో కాశి క్షేత్రం గా ప్రసిద్ధిగాంచిన కాలేశ్వరాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోoశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కాళేశ్వరంలో పుష్కర స్నానమాచరించి బండి సంజయ్ కుమార్ దంపతులు ముక్తేశ్వరుడిని దర్శించుకున్నరూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాలో 50 కోట్ల మంది భక్తులకు అద్బుతమైన ఆతిధ్యమిచ్చామని తెలిపారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారని అట్టి నిధులు సరిపోవని ఇంకొన్ని నిధులు కేటాయించి పుష్కరాలకు విచ్చేసే 50 లక్షల మందికి ఆతిథ్యం ఇవ్వాలని అన్నారు. ముందుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీమణి బండి అపర్ణతో కలిసి మధ్యాహ్నం కాళేశ్వరం విచ్చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పోలీస్ వందనాన్ని స్వీకరించారు.


అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య బండి సంజయ్ దంపతులు సరస్వతి నదీమ తల్లి పుష్కర స్నానాన్నిఆచరించారు. అక్కడి నుండి నేరుగా సరస్వతి మాతను, శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులకు పూజారులు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు.సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం విచ్చేసి పుష్కర స్నానం ఆచరించడం చాలా సంతోషంగా ఉందని, గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమని, 12 ఏండ్లకు ఒకసారి వచ్చేఈ పుష్కరాలకు హాజరై స్నానమాచరించడం ఆనందంగా ఉందంటూ . దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని, నరేంద్రమోదీ నాయకత్వంలో దేశానికి మరింతగా సేవలందించేలా దీవించాలని ఆ స్వామివారిని ప్రార్ధించినట్లు ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం చాలా పవర్ ఫుల్ ప్లేస్ అని తెలుపుతూ కాళేశ్వరంను అద్బుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు.

Next Story