త్యాగానికి, ప్రేమకు ప్రతిరూపం బక్రీద్

by Ratna Kumari |

మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తున్నదని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు.

త్యాగానికి, ప్రేమకు ప్రతిరూపం బక్రీద్
X

దిశ, వరంగల్ బ్యూరో : మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తున్నదని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని గురువారం వరంగల్ నగరంలోని ఎల్బి నగర్, మట్టేవాడ, ఫోర్ట్ వరంగల్ ఈద్గాలలో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ-మురళి గారిని ముస్లిం మత పెద్దలు శాలువాతో సత్కరించారు. బక్రీద్ అనేది త్యాగానికి ,విశ్వాసానికి అల్లాహ్ కి విధేయతకు ప్రతీక అని తెలిపారు. మైనార్టీలకు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో తెచ్చిన రిజర్వేషన్ల వల్ల ఎందరో ముస్లింల జీవితాలు బాగుపడ్డాయని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పునరంకితమైందని చెప్పారు. మైనార్టీల కోసం విద్యా,ఉపాధి, ఆరోగ్య రంగాల్లో అనేక పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. పలు రంగాల్లో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Next Story