ఎగ్స్ ఏజన్సీ ఆటో డ్రైవర్ కు విద్యుత్ షాక్..!

by Bhanu |   (  Updated:2025-04-29 13:37:55  IST  )

మండలంలోని అంగన్వాడీ సెటర్లకు వారంలో రెండు సార్లు గుడ్లు సరఫరా చేసే ఏజన్సీకి చెందిన ఆటో డ్రైవర్ విద్యుత్ షాక్ గురైన ఘటన మంగళవారం మండలంలోని మల్లూరులో చోటు చేసుకుంది.

ఎగ్స్ ఏజన్సీ ఆటో డ్రైవర్ కు విద్యుత్ షాక్..!
X

దిశ, మంగపేట : మంగపేట మండలంలోని మల్లూరులో మంగళవారం ఓ విద్యుత్ షాక్ ఘటన కలకలం రేపింది. అంగన్‌వాడీ కేంద్రాలకు వారంలో రెండు సార్లు గుడ్లు సరఫరా చేసే ఏజన్సీకి చెందిన డ్రైవర్ నవీన్ అనే వ్యక్తి ఈ ప్రమాదానికి గురయ్యాడు. హన్మకొండకు చెందిన నవీన్, మల్లూరులోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసిన అనంతరం, తిరుగు ప్రయాణంలో శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయం రోడ్డులో ఆటోను ఆపి మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

వీధి లైట్ల కోసం ఏర్పాటు చేసిన ఎంసీబీ విద్యుత్ లైన్, కంచెకు ఉన్న ఫెన్సింగ్ వైర్‌కు తగిలి ఉండడంతో నవీన్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి మంగపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి ప్రస్తుతం సీరియస్‌గా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, గుడ్ల సరఫరాదారుడి పరిస్థితిపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

Next Story