- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామలో దారుణం.. కన్నబిడ్డల హత్య కోసం సుఫారీ ఇచ్చిన తండ్రి
ఆస్తి కోసం కన్న కొడుకులకు బిస్కట్ లో విషం ఇచ్చి చంపాలని కన్న తండ్రి ఇచ్చిన సుఫారీ ఇచ్చిన సంఘటన రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బటి తండాలో చోటు చేసుకుంది.

దిశ, రఘునాథపల్లి : జనగామలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న కొడుకులకు బిస్కట్ లో విషం ఇచ్చి చంపాలని కన్న తండ్రి ఇచ్చిన సుఫారీ ఇచ్చిన సంఘటన రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బటి తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భానోత్ శ్రీనివాస్ కి అనితతో 2016లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వేరే గ్రామానికి చెందిన మూడావత్ మమతను రెండో పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాస్. 20 గుంటల భూమి కుమారుల పేరిట ఉండటంతో బిస్కట్ లో విషం పెట్టి చంపాలని రెండో భార్యతో పన్నాగం పన్నాడు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి సుఫారీ ఇవ్వగా.. ఆ వ్యక్తి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై నరేష్ యాదవ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి.. జనగామ కోర్టులో హాజరు పరిచారు. 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఎస్సై నరేష్ యాదవ్ తెలిపారు.






